- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DTF, TPUS: కుల గణన సర్వే గడువు పొడిగించాలి.. డీటీఎఫ్, టీపీయూఎస్ డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే(Caste Census Survey ) చేయడంలో ఎన్యుమరేటర్లు(Enumerators) అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, సమాచార సేకరణకు సైతం చాలా సమయం పడుతోందని, అందుకే కుల గణన సర్వే గడువు పొడిగించాలని డెమొక్రటిక్ టీచర్స ఫెడరేషన్(డీటీఎఫ్)(The leaders of Democratic Teachers Federation) (DTF) , తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్)(Telangana Region Teachers Union) (TPUS) నాయకులు డిమాండ్(Demand) చేశారు. ఒక్కో కుటుంబానికి 75 అంశాలతో కూడిన ప్రశ్నావళికి సమాచారం సేకరించడానికి చాలా సమయం పడుతోందని, సమాచార సేకరణ ఆలస్యమవుతుండటంతో నిర్ణీత సమయంలో పూర్తయ్యే అవకాశం లేనందున గడువును పొడిగించాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య(M Somaiah), ప్రధాన కార్యదర్శి టీ లింగారెడ్డి(T Lingareddy), టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు(Hanumanth Rao), నవాత్ సురేశ్(Navath Suresh) డిమాండ్ చేశారు.
అదేవిధంగా సరైన ప్రచారం లేని కారణంగా కుటుంబాల యజమానులు ఇండ్లలో అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు. ఉన్నా కొందరు స్పందించడం లేదని, మధ్యాహ్నం, సాయంత్రం వేళలో సర్వే చేయడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఉదయం సర్వే చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్యుమరేటర్ల సంఖ్యను పెంచి, ఇండ్ల సంఖ్యను తగ్గించాలని కోరారు. ఇదిలా ఉండగా ఈనెల 15ప హిందువుల ముఖ్య పండుగ కార్తీక పౌర్ణమి ఉందని, ఆరోజు ఎన్యుమరేటర్లకు సెలవు ఇవ్వాలని టీపీయూఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.