జీతాలు ఎప్పుడిస్తారు?

by Mahesh |
జీతాలు ఎప్పుడిస్తారు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘జనవరి, ఫిబ్రవరి నెలల వేతనాలు ఇవ్వలేదు. జిల్లా కోశాధికారి నుంచి టోకెన్ నంబర్లు వచ్చినా పెండింగ్‌లోనే పెట్టారు. వేతనాలు రాక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక వడ్డీ పెరిగి ఆర్థికంగా మరింత సతమతమవుతున్నాం. మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని వేతనాలు మంజూరు చేయాలి’’..అని రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు కోరారు.

మంత్రి ఆదేశించినా జాప్యమే..

పెండింగ్ వేతనాలు చెల్లించాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోయారు. పెండింగ్ వేతనాలకు సంబంధించిన ఫైల్ క్లియర్ చేయాలని మంత్రి హరీశ్‌రావు..అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. అయినా నేటి వరకు వేతనాలు రాలేదన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు రావాల్సి ఉన్నదన్నారు. మంగళవారం మరోసారి మంత్రి దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు.

అమలు కాని సీఎం హామీలు

కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నేటి వరకు నెరవేరలేదని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లు ఉన్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed