Ganesh Chaturthi: మార్పు మొదలైంది.. ప్లాస్టిక్ కు గుడ్ బై చెప్పి మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే నిలబెడుతున్న భక్తులు

by Prasanna |
Ganesh Chaturthi: మార్పు మొదలైంది.. ప్లాస్టిక్ కు గుడ్ బై చెప్పి మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే నిలబెడుతున్న భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా వినాయకుడి పూజలు మొదలయ్యాయి. గణేష్ విగ్రహాలను నిలబెట్టి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఈ పూజల్లో పాల్గొంటున్నారు. అయితే, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి పీఓపీ గణేశ విగ్రహాలను నిషేధించడంతో మట్టి గణేష్ విగ్రహాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ సంవత్సరం కాగితాల విగ్రహాలకు కూడా ఫుల్ డిమాండ్ మొదలైంది.

డిల్లీ నుంచి గల్లీ వరకూ వినాయకుడి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కొందరైతే సొంత ఊర్లకి వెళ్లారు .. మరి కొందరు విగ్రహాన్ని మండపాల్లో నిలబెట్టి పూజలు చేస్తున్నారు. అయితే, ఈ సారి మార్పు మొదలైనట్లే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో మట్టి గణపయ్యను నిలబెట్టారు.

మట్టి విగ్రహాలను 5 అడుగుల కంటే ఎక్కువ నిర్మించడం చాలా కష్టం. అయితే, ఈ కాగితంతో చేసిన గణపతి విగ్రహాన్ని 10 అడుగుల కంటే ఎక్కువ తయారు చేయవచ్చు. ఇలా ఈ సారి ప్లాస్టిక్ కు గుడ్ బై చెప్పి మట్టి విగ్రహాలకె ఓటేస్తున్నారు. మార్పు మొదలైందంటూ నెటిజెన్స్ వినాయకుడు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story