Uttam Kumar Reddy : కృష్ణా జలాల సమస్యపై కేంద్రం చొరవ తీసుకోవాలి : ఉత్తమ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-19 09:45:09.0  )
Uttam Kumar Reddy : కృష్ణా జలాల సమస్యపై కేంద్రం చొరవ తీసుకోవాలి : ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపుల సమస్యపై కేంద్రం చొరవ తీసుకోవాలని తెలంగాణ నీటీ పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోరారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వాటర్ విజన్(Water Vision - 2047) సదస్సులో ఆయన రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులు, నిధుల ఆవశ్యకత అంశాలను వివరించారు. కృష్ణా జలాల సమస్యలో కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకోవాలని, పీఆర్‌ఎల్‌ఐఎస్, సీతారాం సాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల మంజూరీకి చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ నది పునరుజ్జీవనం, గోదావరి-మూసీ లింక్ కోసం నిధులు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి ఎన్‌డిఎస్‌ఏ నివేదికను ముందస్తుగా సమర్పించాలని కోరారు.

అంతకుముందు తెలంగాణ గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Seethakka) ప్రసంగించారు. తెలంగాణ తాగునీటి స్థిరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని కోరారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరాకు వేల కోట్లు వెచ్చిస్తున్నామని.. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన విధంగా కనీసం రూ.16,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబాషిష్ ముఖర్జీలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed