- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేపర్ లీకేజీపై సిట్ విచారణలో నిర్లక్ష్యం.. ఏఐఎస్ఎఫ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీ పై ప్రభుత్వం వేసిన కమిటీ సిట్ విచారణ నిర్లక్ష్యం చేస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ లో పేపర్ లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పేపర్ లీకేజీ పై కేవలం అరెస్ట్ చేసిన నిందితుల్ని కాకుండా బోర్డు చైర్మన్, సెక్రటరీ, సభ్యులందరినీ కూడా విచారణ చేయాలన్నారు.
టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ వెంటనే తొలగించి టీఎస్పీఎస్సీ బోర్డు మొత్తం ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. అనేక పరీక్ష పత్రాలు లీకేజీ అయినాయని దానివల్ల లక్షలాదిమంది నిరుద్యోగులు మళ్లీ పరీక్షలు రాసే పరిస్థితి వచ్చిందన్నారు. నిరుద్యోగులు పేపర్ లీకేజ్ కావడం వల్ల మళ్ళీ పరీక్షలు రాయాలంటే వారు మళ్ళీ కోచింగ్ వెళ్లి హాస్టల్స్ లో ఉంటూ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థికి పరీక్ష నిర్వహించేంతవరకు ప్రభుత్వమే వారికి నిరుద్యోగ భృతి, ఉచిత కోచింగ్, హాస్టల్ వసతి కల్పించాలని, టీఎస్పీఎస్సీ లో పేపర్ లీకేజీ పై పూర్తిస్థాయి విచారణ జరిపి లీకేజ్ దార్ల వెనుక ఎంత పెద్దవారున్నా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.