- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఎంసీ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ కేఎంసీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం మూలంగానే మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని, వెంటనే ప్రిన్సిపాల్‌పై, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని ప్రీతి సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేస్తున్నాడని మానసిక వేధింపులకు గురి చేస్తున్నడని ప్రిన్సిపాల్‌కి పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదన్నారు.
ఈ ర్యాగింగ్ కేసును తప్పుదోవ పట్టించే విధంగా ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్లను సీనియర్స్ గతంలో కూడా ర్యాగింగ్ చేశారని, అధికారులు చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థిని ప్రీతి సీనియర్ విద్యార్థి ర్యాగింగ్, లైంగిక వేధింపులను భరించలేకనే ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించిందని పేర్కొన్నారు.
ఒక ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులపై కూడా ర్యాగింగ్ జరగడం బాధాకరమన్నారు. రోజురోజుకు అమ్మాయిలపై ర్యాగింగ్‌లు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని వెల్లడించారు. కళాశాలల్లో ర్యాగింగ్‌లపై ఎక్కడ కూడా సెమినార్లు, అవగాహన సదస్సులు జరపడం లేదన్నారు. అన్ని కళాశాలల్లో ర్యాగింగ్‌లపై సెమినార్లు, సదస్సుల జరపాలని, ర్యాగింగ్ నియంత్రణ కమిటీలు నియమించాలని వారు డిమాండ్ చేశారు.