టీజీఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌కు రూ. 45698 కోట్ల రాబడి

by Mahesh |
టీజీఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌కు రూ. 45698 కోట్ల రాబడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ భారాలపై తెలంగాణ విద్యుత్ శాఖ తర్జన భర్జన పడుతుంది. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్కు రూ. 2400 కోట్ల భారాలను మోస్తున్న విద్యుత్ శాఖ ఆ మేరకు ప్రభుత్వం నుంచి నిధులను సేకరించుకోవాల్సి ఉంది. అదే సమయంలో నిరంతరం 24 గంటల విద్యుత్ సరఫరాను చూస్తూనే మరో వైపు రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించాల్సిన పరిస్థితి నెలకొంది. వెరసి రూ.20151 కోట్ల గ్యాప్తో భారాలను మోస్తూ ముందుకు సాగుతోంది. నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న విద్యుత్ శాఖ ఆ మేరకు ఖర్చుల భారాలను మోస్తోంది.

ప్రతినెలా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలి పోవడం, లోడ్ భారాలు పెరిగి నిరంతర విద్యుత్ సరఫరాలో అవాంతరాలు రావడం తదితర సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుత విద్యుత్ టారీఫ్తో ఎస్పీడీసీఎల్ సంస్థకు రూ. 36277 కోట్ల రాబడి వస్తుండగా, అటు ఎన్పీడీసీఎల్‌కు రూ. 9421 కోట్ల రాబడి వస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కలిపితే రూ. 45698 కోట్లు రాబడి ఉండగా, వివిధ అవసరాలు, వేతనాలు, ఇతర వ్యయాల కింద రూ.65849 కోట్లు ఖర్చులు రానున్నాయని డిస్కం సంస్థలు భావిస్తున్నాయి. ఇంకా రూ.20151 కోట్ల లోటులో డిస్కంలున్నాయి. ఈ క్రమంలోనే లోటు పుచ్చుకోవడానికి మార్గం చూడండంటూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నివేదించాయి. గడిచిన రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలను పెంచకపోవడంతో డిస్కంలకు ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు.

గృహజ్యోతికి రూ.2400 కోట్లు

ఇది ఇలా ఉంటే గృహ జ్యోతి పథకం కింద పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వడానికి రానున్న ఏడాది కి గాను రూ. 2400 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. అదనపు ఆదాయం రావడానికి విద్యుత్ ఛార్జీలను ఎంతో కొంత పెంచితే బాగుంటుందని డిస్కంలు ఈ మేరకు ఈఆర్సీకి ప్రతిపాదించినా విద్యుత్ వినియోగదారులపై భారం మోపవద్దని అటు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.


Next Story

Most Viewed