- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TGPSC: గ్రూప్-1 అభ్యర్థులకు తీపి కబురు.. మెరిట్ లిస్ట్‌పై కసరత్తు పూర్తి

దిశ, తెలంగాణ బ్యూరో: మార్చి 3 తర్వాత గ్రూప్-1 మెరిట్ లిస్ట్‌ను ప్రకటించేందుకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కుల వివరాలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రీకౌంటింగ్ కోసం 15 రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పేపర్ వాల్యూయేషన్ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రిజల్ట్‌ను పెండింగ్‌లో పెట్టారు. మార్చి 3న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై, మరునాడు ముగిసే చాన్స్ ఉంది. ఆ తర్వాత రోజు నుంచి ఎప్పుడైనా టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిసింది.
ఈ పద్ధతిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్?
గ్రూప్-1 మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చిన మార్కులను అన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పరిశీలించుకునేందుకు సమయం ఇవ్వనుంది. టోటల్ మార్కుల్లో తేడాలు ఉన్నట్టు అనుమానం ఉంటే, రీకౌంటింగ్‌కు అవకాశం ఇవ్వనున్నారు. అందుకోసం రిజల్ట్ ప్రకటించిన రోజు నుంచి 15 రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు. అయితే, నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల ఖాళీల మేరకు మల్టీ జోన్లు, కేటగిరీల వారీగా మెరిట్ లిస్టును సర్వీస్ కమిషన్ ప్రకటించనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 లో పిలవాలా? లేదా 1:1.5? పద్ధతిలో పిలవాలా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. 1:2 ప్రకారం క్యాండిడేట్స్‌ను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిస్తే, ఉద్యోగం వస్తుందనే ఆశను ఎక్కువ మందికి కల్పించడం సరికాదేమోనని అభిప్రాయంలో కమిషన్ వర్గాలు ఉన్నాయి.
జూన్‌లో తుది ఫలితాలు?
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటించాలని సర్వీస్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్స్‌ను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే చాన్స్ ఉంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచిన అభ్యర్థుల అందరి డిగ్రీ మెమోలు, క్యాస్ట్ సర్టిఫికెట్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది ఫలితాలు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి, ఫైనల్ రిజల్ట్‌ను జూన్‌లో ప్రకటించే చాన్స్ ఉందని తెలిసింది. గ్రూప్-1 సెలక్షన్ పూర్తయిన తర్వాతే వరుసగా గ్రూప్-2, 3 సెలక్షన్ ప్రక్రియను ప్రారంభించనున్నారని సమాచారం.