- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGPSC Group-2: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్ల విడుదల ఎప్పుడంటే..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణాలో గ్రూప్-2 పరీక్షల(Group-2 Exams)ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఈ నెల(డిసెంబర్) 15,16 వ తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం నాలుగు పేపర్లలో గ్రూప్-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. పేపర్-1 డిసెంబర్ 15న ఉదయం 10-12.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 3-5.30 వరకు నిర్వహించనున్నారు. ఇక పేపర్-3 డిసెంబర్ 16న 10-12.30 వరకు, పేపర్-4 మధ్యాహ్నం 3-5.30 వరకు ఉంటుంది. అయితే ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు(Hall Tickets) 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్(Naveen Nicholas) ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రం(Exam Center)లోనికి గంటన్నర ముందు నుంచే అనుమతి ఇస్తామని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు క్లోజ్(Gates Close) చేస్తామని పేర్కొన్నారు. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. దాదాపు 5 లక్షల మందికి పైగా అప్లై(Apply) చేసుకున్నారు.