TG RTC: బస్సులో జన్మించిన చిన్నారికి లైఫ్ టైమ్ ఫ్రీ జర్నీ

by Prasad Jukanti |
TG RTC: బస్సులో జన్మించిన చిన్నారికి లైఫ్ టైమ్ ఫ్రీ జర్నీ
X

దిశ, డైలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి తన జీవిత కాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందించినట్లు టీజీ ఆర్టీసీ (TG RTC) యాజమాన్యం ప్రకటించింది. గద్వాల డిపోకు (Gadwal Depot) చెందిన బస్సులో జనవరి 2న రాయచూర్ నుండి గద్వాలకు ప్రయాణిస్తుండగా ఒక గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన బస్సు కండక్టర్‌ కిషోర్‌ కుమార్‌, డ్రైవర్‌ నరేందర్‌ గౌడ్‌ బస్సును పక్కకు ఆపి 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అంతలోనే పురిటినొప్పులు ఎక్కువ కావడంతో బస్సులో ఉన్న మహిళా ప్రయాణికుల సహకారంతో సదరు మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు (Child Born in Bus) జీవిత కాలపు ఉచిత బస్ పాస్ (Life Time Bus Pass) ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar), ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో బస్ పాస్ మంజూరు చేశారు. అలాగే ఆయా సందర్భాల్లో విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న పలువురు సిబ్బందికి ఈ సందర్భంగా యాజమాన్యం ఘనంగా సన్మానించింది.



Next Story

Most Viewed