TG Intermediate Exams: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. అధికారుల కీలక సూచనలు

by Shiva |   ( Updated:2025-03-05 03:51:34.0  )
TG Intermediate Exams: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. అధికారుల కీలక సూచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు (Intermediate Exams) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఫస్టియర్ (First Year) సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 (Second Language Paper-2) పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. పరీక్షలు నేటితో ప్రారంభమై ఈ నెల 25కి ముగిననున్నాయి. ఫస్టియర్, సెకండియర్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఈ మేరకు అధకారులు రాష్ట్రంలో 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో అత్యధికంగా హైదరాబాద్‌ (Hyderabad)లో 244, రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)లో 185, మేడ్చల్ జిల్లా (Medchal District)లో 150 కేంద్రాలు ఉన్నాయి.

అయితే, పరీక్షకు వారం ముందే ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ (OMR), ఆన్సర్ షీట్లు (Answer Sheet)లు జిల్లా కేంద్రాలకు చేరాయి. ఒక్క నిమిషం లేట్ నిబంధనను ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) సడలించింది. ఈ మేరకు 9.05 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఎగ్జామ్ సెంటర్లలోకి స్మార్ట్‌వాచ్‌ (Smart Watches)లు, మొబైల్ ఫోన్లు (Cell Phones), ఎలక్ట్రికల్ పరికరాలు (Electrical Gadgets) అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య (Krishna Aditya) స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని అన్నారు.

Next Story

Most Viewed