- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG High Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. భుజంగ రావు, రాధాకిషన్ రావులకు బెయిల్ మంజూరు

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగ రావు (Additional SP Bhujanga Rao), మాజీ డీసీపీ రాధాకిషన్ రావు (Farmer DCP Radha Kishan Rao)లకు హైకోర్టు ధర్మాసనం ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రూ.లక్ష చొప్పన రెండు పూచికత్తులు, పాస్‌పోర్టు (Passport)లను కూడా హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, సాక్షాధాలను కూడా చెరిపి వేసేందుక ప్రయత్నం చేయకూడదని అడిషనల్ ఎస్పీ భుజంగ రావు (Additional SP Bhujanga Rao), మాజీ డీసీపీ రాధాకిషన్ రావు (Farmer DCP Radhakishan Rao)లకు స్పష్టం చేసింది. అదేవిధంగా ఇదే కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న (Additional SP Tirupathanna)కు సుప్రీం కోర్టు కూడా షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు (Additional SP Bhujanga Rao)ను గత సంవత్సరం మార్చి 23న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆగస్టు 19న ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం బెయిల్ గడవును పొడిగిస్తూ వచ్చింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషనల్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో అయన నవంబర్ 14న తిరిగి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. అదేవిధంగా ఇదే కేసులో డీసీపీ రాధాకిషన్ రావు (DCP Radha Kishan Rao)ను గత సంవత్సరం మార్చి 29 అరెస్ట్ అయ్యారు. అయితే, ఆయన మామగారు హఠాత్తుగా మరణించడంతో అనంతరం 2014. డిసెంబర్ 25న ఆయనకు హైకోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా వారి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.