- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Govt.: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం.. ఒకేసారి రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించి ఆదాయాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకపోయినా ఏకకాలంలో ఓపెన్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సైతం పూర్తి చేయాలని డెసిషన్ తీసుకున్నది. దీనికి సంబంధించిన ‘ప్రీ-రిజిస్ట్రేషన్’ మాడ్యుల్ రూపొందించింది. ఈ అవకాశం ఎల్ఆర్ఎస్-2020 దరఖాస్తుదారులకు, ఇప్పుడు దరఖాస్తు చేయబోతున్న వారికీ ఉన్నదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జారీ చేసిన సర్క్యూలర్‌లో స్పష్టం చేసింది.
లింక్ డాక్యుమెంట్లు లేని దరఖాస్తులను..
లింకు డాక్యుమెంట్లు లేని దరఖాస్తులను తాజాగా రూపొందించిన మాడ్యూల్ ద్వారానే డీల్ చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అనధికార లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయనే దానితో సంబంధం లేకుండా 26.08.2020 లేదా అంతకు ముందు సేల్ డీడ్ అయిన యజమానులు ఎల్ఆర్ఎస్-2020 కింద దరఖాస్తు చేసుకున్నా, చేసుకోకపోయినా అలాంటి ప్లాట్లకు సైతం రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఎల్ఆర్ఎస్ చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ సర్క్యూలర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మహబుబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే అమలు చేయాలని సర్కారు డెసిషన్ తీసుకున్నది. అయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వం ఎందుకు హడావుడి చేస్తోందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆ రంగంపై ఆధారపడ్డ వారు మాత్రం సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
జీహెచ్ఎంసీలో హెల్ప్ డెస్క్‌లు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వం కల్పించిన 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆఫీసుకు వచ్చిన వారిని గైడ్ చేసేందుకు జోనల్ ఆఫీసులో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శుక్రవారం ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చార్మినార్ జోనల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసింది.