TG Govt.: రోల్ మోడల్ తెలంగాణ.. ఆర్థిక సర్వేలో ప్రకటించిన కేంద్రం

by Shiva |
TG Govt.: రోల్ మోడల్ తెలంగాణ.. ఆర్థిక సర్వేలో ప్రకటించిన కేంద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వేలో తెలంగాణ అనేక అంశాల్లో ఆదర్శంగా నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి తెలంగాణ ఘనతను చాటింది. అనేక పథకాల అమలు, వినూత్న పథకాల అమలులో ముందుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఆర్థిక సర్వేలో తెలంగాణకు ప్రశంసలు దక్కాయి. రాష్ట్రం సొంత ఆదాయం (స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ) (ఎస్వోటీఆర్), వీ హబ్ మహిళలకు జాతీయ స్థాయిలో రోల్ మోడల్, సాగునీటి ప్రాజెక్టులకు నీటి వనరులు కల్పించడం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించడం, జీఎస్వీఏలో తెలంగాణ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడాన్ని ప్రశంసించింది.

ఆర్థిక సర్వే ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్వరకు సొంత ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం 88% ఆదాయాన్ని స్వయంగా సేకరించుకోవడంతో దేశంలోనే తన ప్రత్యేతను చాటింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రంపై ఆధారపడకుండా, తెలంగాణ సొంతంగా ఆదాయాన్ని పెంచుకోవడం ఆర్థిక పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనమని సర్వే పేర్కొంది. 15 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే 88శాతం సొంత పన్నుల రాబడుల్లో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ, తన ఆర్థిక పరిపుష్టిని చాటింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎమ్మెస్ఎంఈ పాలసీని ఇటీవల ప్రకటించింది. ఓఎన్డీసీ పోర్టల్, జీఈఎం పోర్టల్‌లో విక్రేతల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎమ్మెస్ఎంఈలలో ఇ-కామర్స్ వ్యాప్తిలో పెరుగుదలను ఊహించింది.

సాగునీటి రంగంలో గణనీయమైన వృద్ధి

2016‌ నుంచి 2021 వరకు దేశ వ్యాప్తంగా సాగునీటి రంగంలో తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించినట్లుగా ఆర్థిక సర్వే తెలిపింది. గతంలో 49.3 శాతం ఉన్న సాగునీటి శాతం 2021 కల్లా 55 శాతానికి గ్రాస్డ్క్రాప్డ్ ఏరియా(జీసీఏ) చేరిందని సర్వే తెలిపింది. హర్యానా, పంజాబ్, యూపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక సాగు సౌకర్యం పెరిగిందని సర్వే తెలిపింది. తెలంగాణలో 86 శాతానికి సాగు శాతం పెరిగిందని నివేదికలో తెలిపారు. అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. తెలంగాణ రైతాంగం దేశానికి ఆదర్శంగా నిలిచింది.

100 శాతం తాగునీటి సరఫరా

తెలంగాణ దేశంలోనే 100% తాగునీటి సరఫరా అందించిన తొలి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్, రాష్ట్రం ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం అందింది. ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని అందించారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని నల్లాల ద్వారా అందించిన చరిత్ర తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబిరేషన్ ల్యాబరేటర్స్ ద్వారా నీటినాణత్యను పరీక్షించి నాణ్యమైన నీటిని అందిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.

దేశానికి ఆదర్శంగా వీహబ్

తెలంగాణలో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) సందర్భంగా ప్రకటించిన వీ హబ్ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. మహిళా పారిశ్రామికవేత్తల పొత్సాహించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన వీ హబ్ ఇప్పుడు రాష్ట్ర మహిళ లకు అద్భుత అవకాశాలను అందిస్తూ, వేలాది స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తోంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వీహబ్ దేశా నికి రోల్ మోడల్ గా నిలిచిందని పేర్కొంది. వీ హ బ్ ద్వారా ఇప్పటి వరకు రూ.177 కోట్ల నిధులను స మకూర్చారు. 6376 స్టార్ట్ ఆప్ లను ప్రొత్సహించా రు. స్టార్ట్అప్ లకు చెందిన వారు 7828 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. గత రెండేళ్లలో వీహబ్ ద్వారా ప్రారంభమైన స్టార్ట్ఆప్లు 75 శాతం విజయవంతమయ్యాయి.

సేవల రంగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన..

ఆర్థిక సర్వే ప్రకారం జీఎస్వీఏ (గ్రాస్ స్టేట్ వాల్యూయాడెడ్) తో తెలంగాణ సేవల రంగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. తెలంగాణ ఐటీ, స్టార్టప్, ఫిన్‌టెక్ రంగాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదిగింది. గ్లోబల్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం బీఆర్‌ఎస్ పాలనలో ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి వేగంగా కొనసాగింది. ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ ప్రగతి, మహిళా శక్తీకరణ, నీటి పారుదల వంటి రంగాల్లోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, తమిళనాడు వారి సేవలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కు వ జీఎస్వీఏ రియల్ ఎస్టేట్, నివాసం, వృత్తిపరమై న సేవల యాజమాన్యం నుండి వస్తు న్నాయి. క ర్నాటక (బెంగళూరు), తెలంగాణ (హైదరాబాద్), మహారాష్ట్ర (ముంబై), హర్యానా (గురుగ్రా మ్), తమిళనాడు (చెన్నై) ఐటీ ఫిన్‌టెక్ సేవల కేంద్రీకరణను కలిగి ఉన్నాయి. ఇక్కడ కార్యాల యాలు, నివాస స్థలాలకు అధిక డిమాండ్‌ ఉంది.


Next Story

Most Viewed