- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG Govt.: ఆరు కాదు.. నూటా అరవై..! ఇచ్చిన హామీలకు మించి అమలు చేసిన సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్‌గా, హైదరాబాద్నుఫ్యూచర్సిటీగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నం తొలి ఏడాదిలోనే ఫలితాలు ఇచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. తొలి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలతో ప్రజాప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఫలితంగా తెలంగాణలో నిరుద్యోగిత శాతం తగ్గుముఖం పట్టింది. జాతీయ స్థాయిలో కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.
గతేడాది 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉంటే.. ఈ ఏడాది 2024 జూలై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి చేరింది. తొలి ఏడాదిలోనే సుస్థిర ప్రజాస్వామిక పాలనతో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టింది. అధికారం చేపట్టినప్పటి తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ సమ్మిళిత అభివృద్ధికి నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకే పరిమితం కాకుండా దాదాపు 160 వినూత్న కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం చేపట్టింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో వినూత్న ఆలోచనతో వీటికి శ్రీకారం చుట్టారు.
పదేళ్ల విధ్వంసపు ఆనవాళ్లను చెరిపేసి తెలంగాణ పునర్ వైభవాన్ని కొనసాగిస్తూనే.. అన్ని రంగాల్లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఈ వానాకాలంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడింది. 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తే.. 153 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి కావడం విశేషం. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశంలోని అందరి దృష్టినీ ఆకర్షించింది. దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని ఇటీవలే కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. జీఎస్డీపీ వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్‌లో ఉందని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ దాదాపు రూ.15.52 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
ప్రజా పాలన విజయోత్సవాల నేపథ్యంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు గతేడాది డిసెంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టిన 160 వివిధ అభివృద్ధి, సంక్షేమ వినూత్న పథకాలన్నీ వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి.
1. మహాలక్ష్మి : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. సగటున రోజుకు 30 లక్షల మంది మహిళా ప్రయాణికులకు లబ్ధి. రూ.1500 కోట్ల ఆదా.
2.రూ.500కే గ్యాస్ సిలిండర్.. మహిళల వంటింటి కష్టాల నుంచి విముక్తి. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి
3. గృహజ్యోతి : 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే గృహాలకు ఉచిత కరెంట్. అరకోటి కుటుంబాలకు లబ్ధి.
4. ఇందిరమ్మ ఇండ్లు : గూడు లేని నిరుపేదల సొంతింటి కల. నియోజకవర్గానికి 3500 ఇండ్లు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇండ్లు మంజూరు.
5. లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరు కోసం ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ప్రారంభం.
6. చేయూత : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం. రూ.5 లక్షల పరిమితి రూ.10 లక్షలకు పెంపు. 91 లక్షల కుటుంబాలకు లబ్ధి. ఏడాదికి రూ.484 కోట్ల అదనపు భారం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.670 కోట్ల చెల్లింపు.
7. ఉద్యోగ సంక్షేమం.. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు
8. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఈహెచ్ఎస్ స్కీమ్‌లో మార్పులు
9. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీ యూనివర్సిటీల ఉద్యోగులకు 5 శాతం ఐఆర్.
10. పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో ఒక డీఏ మంజూరు.
11. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్.
12. ఆర్టీసీలో 557 కారుణ్య పోస్టులు భర్తీ.
13. ఆర్టీసీలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రూ.కోటి ప్రమాద బీమా.
14. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన 251 ఎలక్ట్రిక్ బస్సులు.
15. రెండేళ్లలో అందుబాటులోకి రానున్న 2,800 ఎలక్ట్రిక్ బస్సులు.
16. పెద్దపల్లి, ఏటూరు నాగారంలో కొత్త ఆర్టీసీ డిపోల మంజూరు.
17. జీవో 317, 46లపై కేబినెట్ సబ్ కమిటీలు. బదిలీలకు ఆమోదం.
18. సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా.
19. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి సమయంలో బోనస్ చెల్లింపు.
20. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల చొప్పున బోనస్.
21. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వినతులపై త్రిసభ్య కమిటీ.
22. వైద్య రంగం.. కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఒక్కో కాలేజీలో 50 చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు.
23. 17 నర్సింగ్ కాలేజీలు. ఒక్కోకాలేజీలో 60 సీట్లు. మొత్తం 960 బీఎస్సీ నర్సింగ్ సీట్లు.
24. 28 పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు. 1,680 మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు.
25. గోషామహల్‌లో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా హాస్పిటల్. కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన. రూ.2 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ సేవల విస్తరణ.
26. ఆరోగ్య శాఖలో ఏడు వేలకు పైగా పోస్టుల భర్తీ. మరో 6,300 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 3 వేలకుపైగా కొత్త పోస్టులకు నోటిఫికేషన్లు.
27. ఉస్మానియా మెడికల్ కాలేజీలో రూ.121 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ బిల్డింగులు. గాంధీ మెడికల్ కాలేజీలో రూ.80 కోట్లతో హాస్టళ్ల నిర్మాణం.
28. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ ప్రతి నెలా మొదటి వారంలోనే చెల్లించేలా గ్రీన్ ఛానల్ చెల్లింపులు.
29. గాంధీ, నిమ్స్, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, ఖమ్మం, మహబూబ్ నగర్ టీచింగ్ హాస్పిటళ్లలో వాస్క్యులర్ సెంటర్లు. రూ.33 కోట్లతో అత్యాధునిక వసతులు. కొత్తగా 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు. ఇప్పుడున్న డయాలసిస్ సెంటర్లలో అదనంగా 79 మిషన్లు.
30. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య చికిత్సలు. గాంధీలో ఐవీఎఫ్ సేవలు ప్రారంభం. త్వరలో పేట్ల బుర్జు, ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సేవలు.
31. నిరుద్యోగులకు వార్షిక జాబ్ క్యాలెండర్.
32. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన.. సీనియర్ ఐఏఎస్‌కు చైర్మన్ బాధ్యతలు.
33. ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు అభ్యర్థుల వయో పరిమితి పెంపు.
34. తొలి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. అభ్యర్థులకు నియామక పత్రాలు.
35. మెగా డీఎస్సీ.. రికార్డు వేగంతో 52 రోజుల్లో టీచర్ పోస్టుల భర్తీ. బదిలీలు, పదోన్నతులు.
36. గతంలో పేపర్లు లీకై రెండు సార్లు రద్దయిన గ్రూప్ -1 పరీక్షల నిర్వహణ.
37. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల హామీ.
38. సింగరేణిలో కారుణ్య నియామకాలు.. ఉద్యోగ నోటిఫికేషన్లు.
39. రాజీవ్ అభయహస్తం. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం
40. తెలంగాణ పునర్ నిర్మాణం.. సబ్బండ వర్గాల తెలంగాణతల్లి విగ్రహం. సచివాలయంలో 17 అడుగుల విగ్రహావిష్కరణ
41. తెలంగాణ రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’.
42. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి.
43. మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లోకి అందరికీ ప్రవేశం.
44. ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ పునరుద్ధరణ.
45. ఆర్ధిక, విద్యుత్, సాగునీటి రంగాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం.
46. వాహనాల రిజిస్ట్రేషన్ల నంబర్లపై టీఎస్‌ను టీజీగా మార్చడం.
47. కాల్యుష నివారణ కోసం కాలం చెల్లిన వాహనాలను తొలగించడానికి వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ప్రకటన.
48. తెలంగాణ ఈవీ పాలసీ 2024ను ప్రకటించింది. రెండేళ్ల పాటు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు.
49. 44 మంది ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకం.
50. తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డు.
51. కోఠి మహిళా కాలేజీకి తెలంగాణ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ పేరు.
52. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు.
53. రాష్ట్రంలో కొత్తగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ
54. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.
55. తెలంగాణ మహిళా శక్తి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పం.
56. మహిళలకు వడ్డీ లేని రుణాల పునరుద్ధరణ.
57. మహిళలకు రుణ బీమా పథకం.
58. మహిళా సంఘం సభ్యురాలికి రూ.10 లక్షల ప్రమాద బీమా.
59. మహిళా సంఘాలకు ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు. ఏటా 5,000 గ్రామ సంఘాలకు రూ.5,000 కోట్లు.
60. శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్.
61. మహిళా సంఘాలకు స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని అప్పగింత.
62. డెయిరీ సహకార రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు ప్రారంభం.
63. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు.
64. అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు కొత్తగా 213 అంబులెన్స్‌లు. ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో రూ.835 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం.
65. గల్ఫ్ కార్మికులకు భరోసా.. దేశంలోనే మొదటిసారిగా గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు.
66. గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.
67. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ప్రాధాన్యత క్రమంలో అడ్మిషన్లు.
68. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ప్రవాసీ ప్రజావాణి. ప్రతి మంగళవారం, శుక్రవారం గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఎన్‌ఆర్ఐల ఫిర్యాదులకు అవకాశం.
69. రక్షణ శాఖ భూములకు క్లియరెన్స్
70. ఎనిమిదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూముల్లో నిర్మాణాలకు కేంద్రం అనుమతి.
71. మెహిదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి లైన్ క్లియర్.
72. గ్రేట్‌ప్లాన్‌తో, గ్రేటర్ విజన్‌తో సిటీలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో, రోడ్లు, రవాణా సదుపాయాల విస్తరణ.
73. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా.
74. గోదావరి జలాలతో మూసీ పునరుజ్జీవం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు పునర్ వైభవం.
75. మూసీ నదిలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు 39 ఎస్టీపీల ఏర్పాటు. 20 టీఎంసీల గోదావరి నీళ్లను హైదరాబాద్‌లో తాగునీటికి, మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహానికి తరలించేందుకు టెండర్లు.
76. మెట్రో రైలు ఫేజ్ -2 విస్తరణ. రూ.24,237 కోట్లతో 76.4 కిలోమీటర్ల పొడిగింపు. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట్, ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట, మియాపూర్ - పటాన్ చెరువు, ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు రెండో దశ.
77. అల్వాల్ సమీపంలో రాజీవ్ రహదారిపై రూ.2,232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన.
78. హైదరాబాద్ - నాగ్‌పూర్ జాతీయ రహదారిపై రూ.1580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు భూమిపూజ.
79. ఎల్‌బీ నగర్ సమీపంలో బైరామాల్‌గూడ ఫ్లై ఓవర్ ప్రారంభం. ఆరంఘడ్ నుంచి జూపార్క్ వరకు ఫ్లైఓవర్.
80. మీర్ అలం చెరువు సమీపంలో దాదాపు రూ.360 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల వంతెన నిర్మాణం.
81. బాపూఘాట్‌ను దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికల సిద్ధం.
అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ సెంటర్ ఇక్కడ నెలకొల్పనుంది.
82. హైదరాబాద్ సిటీలో 100 కొత్త ఆర్టీసీ బస్సులు.
83. హైకోర్టు నూతన భవనానికి బుద్దేల్‌లో 100 ఎకరాల స్థలం కేటాయింపు.
84. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌వర్‌మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌సీఐటీఐ) ప్రాజెక్టు ద్వారా జీహెచ్ఎంసీలో రూ.5,942 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు.
85. వాన పడితే నీళ్లు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోతున్న సమస్యను పరిష్కరించేందుకు సిటీలో నీళ్లు నిల్వ ఉండే జంక్షన్స్ అన్నింటా వాటర్ ఇన్ టెక్ వెల్స్.
86. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని అధిగమించేలా రూ.826 కోట్లతో అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఆరు జంక్షన్ల అభివృద్ధి.
87. రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం). సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 189 కిలోమీటర్ల రహదారి నిర్మాణం.
88. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారికి ప్రతిపాదనలు.
89. హైదరాబాద్‌లో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు.
90. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. క్యాంపస్ నిర్మాణం ప్రారంభం.
91. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి త్వరలోనే భూమిపూజ.
92. ఏఐ సిటీకి భూమిపూజ.
93. గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్.
94. బీసీ కుల గణన. దేశంలోనే చారిత్రాత్మకంగా ఇంటింటి సర్వే. నవంబర్ 6 నుంచి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే. ఇప్పటికే 96 శాతం పూర్తి.
95. ధరణి ప్రక్షాళనకు ఐదుగురు సభ్యుల కమిటీ. దాదాపు మూడు లక్షల ధరణి పెండింగ్ అర్జీల పరిష్కారం.
96. ప్రైవేటు కబంధ హస్తాల్లో ఉన్న రైతుల రికార్డులు, ధరణి సాఫ్ట్‌వేర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఐసీకి అప్పగింత.
97. కొత్త ఆర్‌ఓఆర్ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టానికి కసరత్తు.
98. రైతు రుణమాఫీ.. దేశంలోనే రికార్డు. రైతులకు సంబంధించి రూ.2 లక్షల వరకు పంట రుణం ఏకకాలంలో మాఫీ. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ.
99. రైతు భరోసా.. ఎకరానికి రూ.5 వేల చొప్పున 69 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్ల చెల్లింపు. ఎకరానికి రూ.7,500 ఇచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించింది.
100. సన్న వడ్లకు రూ.500 బోనస్. వానాకాలం ధాన్యం కొనుగోళ్లతో పాటు చెల్లించిన ప్రభుత్వం.
101. పంటల బీమా పథకం పునరుద్ధరణ. రూ.1300 కోట్ల ప్రీమియం చెల్లింపు. రైతు బీమాకు రూ.1,455 కోట్లు.
102. కోదండరెడ్డి చైర్మన్‌గా రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు.
103. రూ.97 కోట్లతో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్.
104. ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్ట పరిహారంతో పాటు బాధితులకు సాయం అందించేందుకు రూ.260 కోట్లు కేటాయింపు.
105. ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు.
106. వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన. అమ్మ ఆదర్శ కమిటీల సారథ్యంలో రూ.667.25 కోట్లతో పనులు.
107. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు. 20 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు.
108. ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణ. టెట్ పరీక్ష ఫీజు తగ్గింపు. గతంలో టెట్ రాసిన వారికి ఫీజు మినహాయింపు.
109. అంగన్ వాడీల్లో ప్రీస్కూల్ విధానం అమలు.
110. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలోని 7.65 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం పెంపు. కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంపు.
111. రాష్ట్రంలో 65 ఐటీఐలలోఅడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు. టాటా టెక్నాలజిస్ భాగస్వామ్యంతో కొత్త వర్క్‌షాప్‌లు. రూ.2,700 కోట్లతో పనులు.
112. అన్ని నియోజకవర్గాల్లో 100 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాల ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు.
113. ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరు.
114. రాష్ట్రంలో 26 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాత వాటిని విస్తరించడంతో పాటు కొత్తగా 19 అథారిటీలు నెలకొల్పింది.
115. హైదరాబాద్ కేంద్రంగా బయో ఏషియా సదస్సు ఏర్పాటు. జీనోమ్ వ్యాలీ ఫేజ్-2 ఏర్పాటుకు హామీ.
116. డ్రోన్ పైలెట్ల శిక్షణకు ఎన్ఆర్ఎస్సీతో స్టేట్ ఏవియేషన్ అకాడమీతో ఒప్పందం.
117. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి రూ.40232 కోట్ల పెట్టుబడులు. 30 వేల ఉద్యోగాల కల్పనకు భరోసా.
118. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికా, దక్షిణకొరియా పర్యటన సందర్భంగా దాదాపు రూ.31,502 కోట్ల పెట్టుబడులు.
119. టీజీఐపాస్ ద్వారా రూ.12,626 కోట్ల పెట్టుబడులతో 1901 యూనిట్లకు అనుమతులు.
120. టీజీఐఐసీ ద్వారా రూ.8378 కోట్ల పెట్టుబడులతో 368 కంపెనీలకు అనుమతులు.
121. కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో 15 వేల కొత్త ఉద్యోగాలతో నూతన కార్యాలయం ప్రారంభించింది. దీంతో పాటు ఫెడ్ ఎక్స్ గ్లోబల్ లాజిస్టిక్స్ అడ్వాన్స్‌డ్ కేపబిలిటీ సెంటర్, జెడ్ఎఫ్ లైఫ్ టెక్, మారియట్, లండన్ స్టాక్ ఎక్ఛేంజ్ గ్రూప్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను నెలకొల్పాయి.
122. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటుకు కీలక ఒప్పందం చేసుకుంది.
123. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీ - 2024ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.
124. దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్ కేంద్రంలో గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు నిర్వహించింది.
125. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
126. 39 డిగ్రీ కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ఆధ్వర్యంలో జాబ్ గ్యారంటీ మినీ డిగ్రీ కోర్సును ప్రారంభించింది.
127. యాద్రాద్రి పేరు యాదగిరిగుట్టగా మార్పు. భక్తులు కొండ పై నిద్ర చేసేలా డార్మెటరీ హాల్ నిర్మాణం. ఆలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం పనులు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.
128. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.127.65 కోట్లు మంజూరు.
129. భద్రాచలం రామాలయ అభివృద్ధికి రూ.180 కోట్లు కేటాయింపు.
130. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.110 కోట్లు మంజూరు.
131. మహబూబ్‌నగర్ జిల్లా కురుమూర్తి దేవాలయం అభివృద్ధికి రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణం. ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
132. వెనుక బడిన వర్గాల అభ్యున్నతికి కొత్తగా ఎనిమిది కార్పొరేషన్ల ఏర్పాటు. ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాల కార్పొరేషన్లు.
133. రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల రక్షణకు ‘కాటమయ్య రక్షణ కవచం’ ప్రత్యేక కిట్లు.
134. నిరంజన్ అధ్యక్షతన బీసీ కమిషన్ ఏర్పాటు.
135. బూసాని వెంకటేశ్వర్లు సారధ్యంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు.
136. వచ్చే ఐదేండ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల కింద 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చేలా ప్రాధాన్యత క్రమంలో పనులు.
137. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం కుంగిపోవడం, ఈ ప్రాజెక్టు డిజైన్లలో జరిగిన అవకతవకలపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు.
138. ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించేలా సీతారామ ప్రాజెక్టు పూర్తి. ఆగస్టు 15న ప్రారంభించిన ముఖ్యమంత్రి.
139. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ. 2027 సెప్టెంబర్‌లోగా పనులు పూర్తి చేసేందుకు రూ.4,658 కోట్లు కేటాయింపు.
140. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన. కొడంగల్‌తో పాటు మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు రూ.4,350 కోట్ల ప్రతిపాదనలు.
141. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, గతంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు.
142. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు. తొలి ఏడాదిలో రూ. 10,444 కోట్లు సబ్సిడీ చెల్లింపు.
143. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్తు. రాష్ట్రంలోని 39067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు.
144. విద్యుత్తు చార్జీలు పెంచకుండా రాష్ట్రంలో 1.85 కోట్ల మంది వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా.
145. యాదాద్రి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం పనుల వేగవంతం. 800 మెగావాట్ల ఒక యూనిట్ ప్రారంభం.
146. దేశంలోనే వినూత్నంగా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు. 4,000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళిక.
147. అవసరమైన చోట్ల 244 కొత్త సబ్‌స్టేషన్లు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్.
148. గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు.
149. మామునూర్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ కోసం రూ.205 కోట్లు మంజూరు.
150. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయింపు.
151. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్దికి రూ.14 వేల కోట్లు కేటాయింపు.
152. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయింపు.
153. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయింపు.
154. తాగునీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,046.26 కోట్ల కేటాయింపు.
155. ప్రజా ప్రభుత్వంలో ప్రొ.జయశంకర్ స్వగ్రామం అక్కంపేటకు రెవెన్యూ హోదా ప్రకటన.
156. పద్మశ్రీ గ్రహీతలకు సన్మానం. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కు అందజేత. ప్రతి నెల రూ.25 వేల పెన్షన్ మంజూరు.
157. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం-బిలో ఉన్న అమర వీరుల స్తూపం వద్ద గల స్మృతివనం సుందరీకరణ.
158. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.290 కోట్ల పాత బకాయిలు విడుదల.
159. జేఎన్‌జేహెచ్ఎస్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమికి సంబంధించిన స్వాధీన పత్రాలు అందజేత.
160. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (టీజీ న్యాబ్) బలోపేతం.