- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Assembly: మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఆ రెండు అంశాలపైనే కీలక చర్చ

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) శాసనసభతో పాటు శాసన మండలి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations)ను అమలుపై కులగణన సర్వే నివేదికను ప్రణాళికా శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉప సంఘానికి అందజేసింది. నివేదికను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ (Assembly) హాలులో జరగనున్న కేబినెట్ సమావేశంలో (Cabinet Meeting) సబ్ కమిటీ సమర్పించనుంది. ఇక ఎస్పీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ (Justice Shamim Akhtar) ఏకసభ్య కమిషన్ నివేదికను ఉప సంఘానికి సోమవారం అందజేసింది.
అయితే, ఆ రెండు నివేదికలను ముందు కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అనంతరం వాటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (Classification of SC)పై ఏర్పాటైన ఏక సభ్య కమిషన్ ఎస్సీ ఉప కులాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను రూపొందించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉప కులాలు, రెండో క్యాటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో క్యాటగిరీలో ఇతర ఉప కులాలను చేర్చినట్లుగా సమాచారం.
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ (Justice Shamim Akhtar) తన నివేదికను సోమవారం సచివాలయం (Secretariat)లో మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), వైస్ చైర్మన్ దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha)కు హ్యాండోవర్ చేశారు. ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రి వర్గ ఉప సంఘం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో చర్చించింది. ఈ నివేదికను నేడు శాసనసభ (Assembly), శాసన మండలి (Council)లో ప్రవేశపెట్టనున్నారు.