TG Assembly : హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు.. మంత్రి పొన్నం ఫైర్

by Rajesh |
TG Assembly : హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు.. మంత్రి పొన్నం ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరానికి రుపాయి తీసుకురాలేని వాళ్లు కేంద్రమంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి కేంద్రం ఏం ఇస్తుందో కిషన్ రెడ్డి చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. గతంలో టూరిజం మంత్రిగా హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు.

బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని నిరసన తెలుపుతున్నామన్నారు. విహార యాత్రకు వెళ్లినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ నేతలు వెల్లారని సెటైర్లు వేశారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. హైదరాబాద్‌కు రూ.10 వేల కోట్లు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధికి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించారని కొనియాడారు. గతంలో స్మార్ట్ వస్తే కరీంనగర్‌కు ఇచ్చారని.. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ నిధులు తేవాలని పొన్నం కోరారు.



Next Story

Most Viewed