- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Assembly: నాపై క్రిమినల్ రికార్డు చూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: జగదీశ్‌రెడ్డి సంచలన సవాల్

దిశ, వెబ్‌డెస్క్: ఓ మర్డర్ కేసులో16 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలపై జగదీష్‌రెడ్డి సంచలన సవాల్ చేశారు. సోమవారం అసెంబ్లీలో పదేళ్ల విద్యుత్ రంగంపై చేపట్టిన వాడీవేడి చర్చలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ముందు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో జగదీశ్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మర్డర్ కేసు విషయంలో ఆయన 16 ఏళ్ల పాటు కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేశాడని కామెంట్ చేశారు. ఒకవేళ తాను ఆ విషయాన్ని నిరూపించకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
అందుకు స్పందించిన జగదీశ్‌రెడ్డి కోమటిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలపై సవాల్‌కు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మొత్తం మూడు కేసుల్లో కోర్టులు విచారణ చేపట్టి తనను నిర్దోషిగా తేల్చాయని బదులిచ్చారు. ఒకవేళ క్రిమినల్ రికార్టును చూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన సవాల్ విసిరారు. నిజంగా కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడే.. అని సంచులు మోసిన చంద్రుడు కాదని జగదీశ్‌రెడ్డి పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశించి కామెంట్స్ చేశారు.