- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: హరీశ్ రావుకు నిజం చెప్పే అలవాటు లేదు.. అసెంబ్లీలో డిఫ్యూటీ సీఎం హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అప్పుల విషయంలో బీఆర్ఎస్ (BRS) నేతల మాటలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర అప్పులు, FRBM రుణ పరిమితిపై సభలో మాట్లాడుతూ.. నిండు సభలో అప్పుల విషయంలో బీఆర్ఎస్ (BRS) సత్యదూరమైన మాటలు మాట్లాడుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.1.27 వేల కోట్ల అప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఇప్పటి వరకు చేసింది రూ.52 వేల కోట్ల అప్పేనని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) చేసిన అప్పుల్లో గడిచిన ఏడాది కాలంలో రూ.66 వేల కోట్ల అప్పులను తీర్చేశామని అన్నారు. రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లు (Pending Bills)లు ఉండగా.. అందులో నేటికి రూ.20 వేల కోట్లు క్లియర్ చేశామని తెలిపారు. హరీశ్ రావు (Harish Rao)కు ఏనాడు నిజం చెప్పే అలవాటు లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.