Telangana: టెట్ ఫలితాలు విడుదల

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-05 12:17:18.0  )
Telangana: టెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్(Teacher Eligibility Test) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం అధికారికంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగిత ఫలితాలు విడుదల చేశారు. టెట్‌(TET)లో మొత్తం 31.21 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,35,802 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయగా.. 42,384 మంది అర్హత సాధించారు. ఫలితాలను https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు దఫాలుగా టెట్ పరీక్షలను నిర్వహించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ఫిబ్రవరి నెలలో 6000 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ.. ఎస్సీ వర్గీకరణ అంశం కారణంగా నోటిఫికేషన్లకు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.



Next Story

Most Viewed