- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణలో టెట్-2024 నోటిఫికేషన్ విడుదల
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అంతేకాదు.. డీఎస్పీ పరీక్ష తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. జూలై 27 నుంచి 31వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి. జూన్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మరోవైపు డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రాత్రి విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Next Story