- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponnam : సోనియా చలవతోనే తెలంగాణ : పొన్నం
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బిడ్డల బలిదానాలకు చలించి సోనియాగాంధీ(Sonia Gandhi) తెలంగాణ రాష్ట్రం(Telangana State)ఇచ్చారని, సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ ఏర్పడేదా అని బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సూచించారు. మాస శివరాత్రి సందర్భంగా హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న పొన్నం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కొత్తకొండ లో కొండ పైన ఉన్న పురాతన వీరభద్ర స్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంఖు స్థాపన చేశారు. నూతన పల్లె దవాఖానను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పట్ల అంతా కృతజ్ఞతతో ఉండాలన్నారు. తెలంగాణ సాధనకు ఎందరో బలిదానం చేశారని, సకల జనులు ఉద్యమించారన్నారు.
బీఆర్ఎస్ , కేసీఆర్ ఒక్కడే పోరాడితే తెలంగాణ రాలేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటులో ఆనాడు తెలంగాణ బిల్లు పెట్టారన్నారు. ప్రధానీ మోడీ మాత్రం తల్లిని చంపి బిడ్డను ఎత్తుకుపోయారని ఆక్షేపించారని పొన్నం విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో ఎందుకు వివక్ష చూపిస్తున్నారని పొన్నం విమర్శించారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనతో ఆగమైన తెలంగాణను గాడిలో పెట్టే బాధ్యతను ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించారని, ఆ దిశగా ప్రజా ప్రభుత్వం ముందుకెలుతుందన్నారు.