Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తేదీ, సమయం ఫిక్స్.. ప్రభుత్వం ఉత్తర్వులు

by Ramesh N |
Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తేదీ, సమయం ఫిక్స్.. ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్దమవుతోంది. ఈ నెల 9 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవిష్కరించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తేదీ, సమయం ఖరారు చేస్తూ స్టేట్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆర్డర్స్ ఇచ్చారు.

డిసెంబర్ 9, సాయంత్రం 6:05 నిమిషాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నట్లు ఉత్తర్వు జారీ చేశారు. అన్ని విభాగాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నత అధికారులు, అధికారులు, వర్కింగ్ స్టాఫ్,కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవిష్కరణ వేడుకలకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Next Story