- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ప్రాణ త్యాగానికి పూనుకోవడంతోనే ప్రత్యేక తెలంగాణ
దిశ, తిమ్మాపూర్ : ఆనాడు కేసీఆర్ ప్రాణ త్యాగానికి పూనుకోవడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గుర్తు చేశారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ముందుగా ఎల్ఎండీ కాలనీలోని అమర వీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి అల్గునూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా అల్గునూర్ చేరుకున్న ఆయన అక్కడ చౌరస్తాలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వం..పోరాట వీరుల అమరత్వం.. కాంగ్రెస్ కర్కశత్వం.. ఇవే ప్రత్యేక తెలంగాణ రావడానికి ప్రధాన కారణం అని అన్నారు.
పదవులను తృణప్రాయంగా వదిలి తెలంగాణ కోసం పోరాడిన ఘనత కేసీఆర్ ది అన్నారు. తెలంగాణ కోసం ఆనాడు కేసీఆర్ దీక్ష చేపట్టగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంతో రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని అన్నారు. అనేక మంది తమ ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డారని, వారి త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.
తాము ఏదో సాధించామని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని అన్నారు. దీక్ష దివస్ సాక్షిగా తెలంగాణ సమాజం మరో మారు ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనను అంతమొందించేందుకు ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ విజయ, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.
ఉర్రూతలూగించిన రసమయి ఆటా -పాట..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాసిన పాటను సభలో తనదైన శైలిలో ఆడుతూ పాడడంతో సభ ప్రాంగణంలో ఒక్కసారిగా జోష్ నెలకొంది. ఆయన పాటకు కేటీఆర్ తో పాటు సభికులందరూ లేచి కరతాల ధ్వనులతో కోరస్ అందించారు.