ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు

by samatah |
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలపై ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 9 వతేదీ మంగళవారం(రేపు) ఇంటర్మీడియట్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఇంటర్ విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇక ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

Next Story