RGV: అల్లు అర్జున్‌కు తెలంగాణ ప్రభుత్వం రిటర్న్‌ గిఫ్ట్‌! ఆర్జీవీ సెటైరికల్‌ ట్వీట్లు!

by Ramesh N |
RGV: అల్లు అర్జున్‌కు తెలంగాణ ప్రభుత్వం రిటర్న్‌ గిఫ్ట్‌! ఆర్జీవీ సెటైరికల్‌ ట్వీట్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్‌ వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి ఘాటుగా స్పందించారు. శనివారం ఎక్స్ వేదకగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై సెటైరికల్ ట్వీట్లు వేశారు. తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద హిట్ కొట్టి రాష్ట్రానికి గొప్ప బహుమతి ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయనను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

అదేవిధంగా ఇంకో ట్వీట్ చేస్తూ.. ‘అల్లు అర్జున్‌కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇలా ఎందుకు చేశారు అని అందరికీ ఆశ్చర్యం కలిగించిందని, అయితే తెలంగాణ రాష్ట్ర ఫేవరెట్ బిడ్డకు భారీ పబ్లిసిటీ బూస్ట్ ఇవ్వాలనే ఇలా జరిగిందని అభిప్రాయపడ్డారు. అరెస్ట్ అయిన కొన్ని గంటల్లో బెయిల్ రావడంతో బన్నీ మెగా పాపులర్ అయ్యి బాక్స్ లాంగ్ టైమ్ రూల్ చేయడానికి దోహదపడిందని తెలిపారు. దీంతో తెలంగాణ స్టేట్ గొప్పతనాన్ని అత్యంత ఉన్నతంగా నిలబెట్టినందుకు థాంక్యూ సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story