Vinod Kumar: నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: వినోద్ కుమార్

by Mahesh |
Vinod Kumar: నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: వినోద్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ యూజీ 2024 పేపర్ లీక్ ఇష్యూ ప్రస్తుతం దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఈ క్రమంలో నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఙప్తి చేశారు. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కర్ణాటక రాష్ట్రాలు నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు వారి వారి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశాయని గుర్తు చేశారు. నీట్ పరీక్ష వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందని.. తెలంగాణ‌లో PG సీట్లు ఎక్కువ ఉన్నందును.. నీట్ ద్వారా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే దేశవ్యాప్తంగా లక్ష MBBS సీట్లు ఉంటే అందులో దాదాపు 10 శాతం 8265 మంది విద్యార్థులు తెలంగాణలోనే ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీట్ పై అపనమ్మకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

వైద్య విద్య కోర్సులు చదువుకోవాలని ఆశపడే విద్యార్థులకు (NEET) పరీక్ష రాయాలనే నిబంధనను సుప్రీంకోర్టు 2017లో ఆదేశాలు ఇచ్చిందని, నీట్ పరీక్ష ఒక ఎంట్రెన్స్ మాత్రమేనని...ఇటీవల నీట్ పేపర్ లీకేజీ తో ఒక అపనమ్మకం ఏర్పడిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. నీట్ పరీక్షతో లాభం కంటే ఎక్కువ నష్టం ఉందని, తెలంగాణలో మొత్తం 54 మెడికల్ కళాశాలలు ఉండగా ఇందులో 27 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, 23 ప్రైవేటు మెడికల్ కళాశాలలు, 4 మైనార్టీ మెడికల్ కళాశాలలు ఉన్నాయన్నారు. దేశంలో 706 మాత్రమే మెడికల్ కళాశాలలున్నాయని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో తెలంగాణలో సీట్ల సంఖ్య ఎక్కువగా పెరిగిందని, కొన్ని జిల్లాల్లో ఇంకా కళాశాలల నిర్మాణం పూర్తయితే మరిన్ని సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed