Congress Party : నాడు ఆంక్షలు.. నేడు స్వేచ్ఛ.. ‘దిశ’ కథనంపై టీ కాంగ్రెస్ రియాక్ట్

by Ramesh N |   ( Updated:2024-08-05 10:09:15.0  )
Congress Party : నాడు ఆంక్షలు.. నేడు స్వేచ్ఛ.. ‘దిశ’ కథనంపై టీ కాంగ్రెస్ రియాక్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దొరల పాలనలో నాడు ఆంక్షలు, ప్రజా పాలనలో నేడు స్వేచ్చ ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు దిశ పేపర్‌లో వచ్చిన కథనంపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ స్పందిస్తూ ట్వీట్ చేసింది. ‘గత ప్రభుత్వంలో డిస్క్వాలిఫై, సస్పెన్షన్. అప్పుడు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం తక్కువ. ఇప్పుడు పోడియం దగ్గర ఆందోళనలు. ప్లకార్డులతో ప్రదర్శన, నినాదాలు, నిరసన. రెండుంబావు గంటల సమయం వృథా. అప్పుడు నిబంధనలు పెట్టి నీతులు వల్లించారు. ఇప్పుడు ఉల్లంఘన చేస్తున్నారు. బడ్జెట్ సెషన్లో బీఆర్ఎస్ సభ్యుల తీరు. అసెంబ్లీలో ఎక్కువ సేపు మాట్లాడింది వీరే. కాంగ్రెస్‌తో పోలిస్తే అదనపు సమయం’ అని పేర్కొంది.

నాడు నవాబ్ కా హుకుం ద్వారా రెవెన్యూ చట్టం అమలు, నేడు ముసాయిదా, ఇతర రాష్ట్రాల చట్టాల పరిశీలన అంటూ వెల్లడించింది. నాడు అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం గప్పాలు కొట్టుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించింది. నేడు ప్రజా ప్రభుత్వం.. తప్పులు ఉంటే ప్రశ్నించు, లేదంటే సలహాలు ఇవ్వండంటూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని వెల్లడించింది.

Advertisement

Next Story