తెలంగాణ కాంగ్రెస్‌కు హైకోర్టులో ఊరట

by GSrikanth |   ( Updated:2022-12-22 06:28:52.0  )
తెలంగాణ కాంగ్రెస్‌కు హైకోర్టులో ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల కాంగ్రెస్ వార్‌‌రూంపై దాడి చేసి ముగ్గురు సిబ్బందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు జారీ చేసిన నోటీసులు కొట్టివేయలని కోరుతూ ఇషాన్ శర్మ, ప్రతాప్‌, శశాంక్‌లు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసు సైబర్‌ క్రైమ్‌ విభాగం జారీ చేసిన సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా, కేసు ఇన్వెస్టిగేషన్‌పై కూడా ధర్మాసనం స్టే విధించింది. తదుపరి విచారణను రేపటికి(శుక్రవారం) వాయిదా వేసింది.

అయితే, ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేతలపై కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారనే కేసుకు సంబంధించి పోలీసులు.. కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌, శశాంక్‌ , ఇషాన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సునీల్‌ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చినట్టుగా పోలీసులు తెలిపారు. వారి ముగ్గురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేశారు. మరోవైపు సునీల్ కనుగోలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Also Read..

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభంపై దిగ్విజయ్ సింగ్ కసరత్తు

Advertisement

Next Story

Most Viewed