తెలంగాణ కేబినెట్.. ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-07 05:25:52.0  )
తెలంగాణ కేబినెట్.. ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్‌లో ఒక డిప్యూటీ సీఎం, 11 మంత్రులకు చోటు దక్కింది. డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలకు చోటు దక్కింది. ఇక, సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే ఓసీ - 4, ఎస్సీ-2, బీసీలు- 2, ఆదివాసి-1, వెలమ-1, కమ్మ-1లకు చోటు దక్కింది. ఇక, సీఎంగా రేవంత్ రెడ్డి నేడు ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆయనతో పాటు కొత్త కేబినెట్ కొలువు దీరనుంది.

Advertisement

Next Story

Most Viewed