- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం

X
దిశ, నల్లగొండ బ్యూరో: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న రూ.1.50కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలో తీన్మార్ మల్లన్న భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్తుల అప్పగింత ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అప్పగించనున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు జవాబుదారిగా ఉంటానని ప్రకటించారు. తను క్లీన్ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో వస్తున్నానని తెలిపారు. దానికోసం అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.
Next Story