- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్తి కావస్తున్న ఓట్ల లెక్కింపు.. ముందంజలో ఉన్నది ఎవరంటే?
దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. మరికాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొదటిస్థానంలో ఏవీఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 2250 మెజార్టీతో ముందంజలో ఉన్నారు. కాగా, రెండో స్థానంలో చెన్నకేశవ రెడ్డి ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు.
రెండో ప్రయారిటీ ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేయనున్నారు. ఇలా విడుతల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని తొలగించి విజేతను ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు రెండు వేలకు పైగా చెల్లని ఓట్లు రావడం గమనార్హం. వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో ఓట్లు చెల్లకపోవడం సహజంగానే చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్షరాస్యతకు తోడు వృద్ధులు ఉండటంతో ఇలా జరుగుతుంది. కానీ ఈ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారంతా విద్యావంతులే. అయినా ఇన్ని ఓట్లు చెల్లకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. అధికారులు కూడా విస్మయానికి గురవుతున్నారు.