ఎన్నికల కోడ్​తో ఆర్టీసీ కార్మికుల చర్చలు వాయిదా

by M.Rajitha |
ఎన్నికల కోడ్​తో ఆర్టీసీ కార్మికుల చర్చలు వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చలకు పిలిచిన ప్రభుత్వం ఎన్నికల కోడ్​పేరుతో చర్చలు వాయిదా వేసింది. సోమవారం కార్మిక భవన్​వెళ్లిన కార్మిక సంఘాల నేతలు రెండు గంటల పాటు వేచి చూడక తప్పలేదు. చర్చలకు హాజరైతామని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం అటువైపు రాకపోవడంపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎన్నికల కోడ్​ ఉందని తెలిసిన ఎందుకు చర్చలకు ఆహ్వానించారని, మండలి ఎన్నికల నోటిఫికేషన్​ఇంతకు ముందే వచ్చిన సంగతి వారికి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఉద్దేశ్యం పూర్వకంగా ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని, ఎన్నికల కోడ్​ముగిసిన తరువాత చర్చలు తేదీలు ఖరారు చేస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు మూడు రోజుల్లో చర్చలకు రాకుంటే సమ్మె బాట తప్పదని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులను బెదిరింపులకు గురి చేయాలనే కుట్రలు చేస్తుందని, తాము ఇచ్చిన డిమాండ్లు అమలు చేసేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed