వ్యక్తి అనుమానాస్పద మృతి..

by Sathputhe Rajesh |
వ్యక్తి అనుమానాస్పద మృతి..
X

దిశ, మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని వెంపేట్ రోడ్‌లో గల ఒక ఇంట్లో దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్యామ్ రాజ్ మృతుడిని జిన్నా శంకర్(55 )గా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నా శంకర్ ఆయనే జారీ పడ్డాడా, లేదా హత్య చేయపడ్డాడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పది రోజుల క్రితం భార్య తన తల్లిగారింటికి వెళ్లినట్లు తెలిపారు. ఇద్దరు కొడుకులు హైదరాబాదులో ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుకున్న కాలనీ వాసులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు.

Advertisement

Next Story