TSPSC : నేడు సిట్ కస్టడీకి సుస్మిత, లౌకిక్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-14 06:57:17.0  )
TSPSC : నేడు సిట్ కస్టడీకి సుస్మిత, లౌకిక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సుస్మిత ఆమె భర్త సాయి లౌకిక్‌ను మూడు రోజుల సిట్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం ఈ ఇద్దరిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సాయి లౌకిక్, సుస్మిత దంపతులు.. ప్రవీణ్ వద్ద డీఏఓ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని రూ.10 లక్షలకు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించి వీరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని ఇవాళ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించబోతున్నారు. మరోవైపు ఇదే కేసులో టీఎస్ పీఎస్సీ కమిషన్ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మిని గురువారం ఈడీ విచారించింది. అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ విచారణకు రాలేదు.

Advertisement

Next Story