- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సండే ఎఫెక్ట్: నీరా కేఫ్‌కు క్యూ కట్టిన జనం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు ప్రకృతి సిద్ధమైన నీరాను అందించాలని రూ.12 కోట్ల రూపాయల వ్యవయంతో నీరా కేఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఈ నీరా కేఫ్‌ను ఈ నెల 3 వ తేదీన మంత్రి తలసాని, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నీరా కేఫ్ ప్రారంభం అయినప్పటి నుంచి నీరా కేఫ్ దగ్గర జనం రద్దీగానే ఉంది. దీని రుచిని ఇప్పుడు నగర ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రకృతి సిద్దమైనది, ఎన్నో ఔషధగుణాలు కలిగినందున ఎంతో మంది తాగడానికి వస్తున్నారు. ఈ నీరాను ముఖ్యంగా ఉదయాన్నే తాగుతారు.
నేడు ఆదివారం సెలవు కావడంతో సాగర తీరంలో నీరా కేఫ్ దగ్గర నగర వాసులు క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు ఈ నీరా కేఫ్ ఓపెన్ అవ్వడం తో అప్పటికే నీరా ప్రియులు కేఫ్ దగ్గరికి చేరుకున్నారు. ఎవరు కూడా అసహనానికి గురి కాకుండా పద్దతిగా లైన్ లో నిలబడి మరి నీరా రుచి చూస్తున్నారు. మధ్యాహ్నం వరకే సుమారు 15 వందల నుంచి 2 వేల మంది పబ్లిక్ కేఫ్‌కు వచ్చారని, 300 లీటర్లపైగా అమ్మకాలు జరిగాయని అక్కడి సిబ్బంది తెలిపారు. 300 ఎంఎల్ క్వాంటిటి కలిగిన నీరా బాటిల్ 90 రూపాయలు అని సిబ్బంది వెల్లడించారు. ఈ నీరాను కొనుగోలు చేసి సాగర తీరంలో ఆస్వాదించుకుంటా నీరాను నగర వాసులు తాగేస్తున్నారు. నీరా తాగడానికి వచ్చిన వారిలో ఎక్కువగా కొత్తవారే ఉన్నారు.