- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విచారణకు భయమెందుకు..? కవిత స్పందనకు ఈ వారమే సుఖేశ్ కౌంటర్!
దిశ, తెలంగాణ బ్యూరో : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తో ఉన్న వ్యాపార, ఆర్థిక సంబంధాలతో పాటు రూ. 15 కోట్ల ముడుపుల వ్యవహారంపై సుఖేశ్ చంద్రశేఖర్ బుధవారం లేవనెత్తిన ఆరోపణలపై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్ మరో చర్చకు దారితీసింది. ఆమె రియాక్షన్‌పై సుఖేశ్ లాయర్ అనంత్ మాలిక్ ఘాటుగా స్పందించారు. సుఖేశ్ లేవనెత్తిన ఆరోపణలకు కవిత స్పందించిన తీరు చిన్నపిల్లల స్టేట్‌మెంట్‌ను తలపిస్తున్నదని, ఆయన చేసిన ఆరోపణలపై విచారణ ఎదుర్కోడానికి ఆమె ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఒక పరిణతి కలిగిన, నిఖార్సయిన రాజకీయవేత్తగా ఆమె దర్యాప్తునకు సిద్ధం కావాలని హితవు పలికారు. సుఖేశ్ చేసిన ఆరోపణలు ఆధారరహితమైనవని భావిస్తే అందులో నిజానిజాలు దర్యాప్తు ద్వారానే వెలుగులోకి వస్తాయని, దానికి ఆమె జంకాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవిత ప్రకటనను మీడియా ద్వారా తెలుసుకున్నానని ఉటంకించిన లాయర్ అంకిత్ మాలిక్.. ఆమె వ్యాఖ్యలు దర్యాప్తు నుంచి తప్పించుకునేలా ఉన్నాయనే భావన కలుగుతున్నదన్నారు. విచారణను ఎదుర్కోడానికి బదులుగా దాటవేత ధోరణితో ఉన్నారనే అభిప్రాయం ఏర్పడుతున్నదన్నారు. నిఖార్సయిన పొలిటీషియన్లు దర్యాప్తును స్వాగతిస్తారని, కవిత కూడా అలా ఆలోచించి ఉండాల్సిందని, కానీ ఆమె తీరు ఆ తరహాలో లేదన్నారు. సుఖేశ్ ఆరోపణలు నిజం కానట్లయితే దర్యాప్తులో అవి వెల్లడవుతాయని, ఆమె ఎందుకు దానికి ప్రిపేర్డ్ గా లేరని ప్రశ్నించారు. కవిత ప్రకటన చూసిన తర్వాత మొత్తం తప్పును మీడియా, రాజకీయ పార్టీల మీదకు నెట్టారనే అభిప్రాయం కలుగుతున్నదన్నారు. పై విషయాలను అనంత్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో పంచుకున్నారు.
నిబంధనల ప్రకారమే సుఖేశ్ ఆరోపణలు
మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ బుధవారం వెల్లడించిన వివరాలు, వాటికి ఆధారంగా ఉండే వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్‌లను విడుదల చేయడంపై వివరాలు ఇవ్వడంతో పాటు కవిత చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదిగా అనంత్ స్పందించారు. సుఖేశ్ లేవనెత్తిన ఆరోపణలను ‘వేగ్’గా ఇవ్వలేదని, పక్కా నిబంధనల ప్రకారమే వెల్లడించారని తెలిపారు. ఎవిడెన్సు యాక్టులోని సెక్షన్ 65(బీ) ప్రకారం సర్టిఫై చేశారని, ఒక అఫిడవిట్ రూపంలోనే అందజేశారని, అందువల్లనే డిజిటల్ ఎవిడెన్సుగా పనికొచ్చే స్క్రీన్ షాట్‌లను రిలీజ్ చేశారని మాలిక్ గుర్తుచేశారు. తాజగా విడుదల చేసిన లేఖలో సుఖేశ్ చేసిన ఆరోపణలన్నింటినీ రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థల పెద్దలను అడ్రస్ చేస్తూ రాసిన లేఖలో కూడా సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ జరిపించాలని కోరారని గుర్తుచేశారు.
సుఖేశ్ చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నారని, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించడానికి కూడా రెడీగా ఉన్నారని మాలిక్ నొక్కిచెప్పారు. విచారణ జరిగినప్పుడు ఆయన చేసిన ఆరోపణలు, స్క్రీన్ షాట్‌లు నిజమైనవో కావో తేటతెల్లమవుతుందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు జరగాలనే ఆయన కోరుకుంటున్నారని, కానీ కవిత మాత్రం తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె స్టేట్‌మెంట్ ద్వారా అర్థమవుతున్నదని అన్నారు. దర్యాప్తు సంస్థల నుంచి దాగుడుమూతలు ఆడిన తీరులో ఆమె రియాక్షన్ ఉన్నదన్నారు. సుఖేశ్ రాతపూర్వకంగా చేసిన ఆరోపణలన్నీ ఇప్పుడు దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నాయని, ఇది ‘పాపులారిటీ కాంటెస్ట్’ కాదు గదా అని లాయర్ వ్యాఖ్యానించారు.
ఈ వారంలో సుఖేశ్ కౌంటర్ వస్తుంది : లాయర్
సుఖేశ్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నందున కవిత స్టేట్‌మెంట్‌పై ఆయన నుంచి వెంటనే రిప్లయ్ రాలేదని, వారం రోజుల్లో స్వయంగా ఆయనే రాతపూర్వకంగా మీడియాకు వివరిస్తారని లాయర్ మాలిక్ తెలిపారు. కవిత తన స్టేట్‌మెంట్‌లో వాక్‌పటిమను, నైపుణ్యాన్ని ప్రదర్శించారని మాలిక్ ఆరోపించారు. దర్యాప్తు నుంచి తప్పించుకునే ఆమె ధోరణి, స్టేట్‌మెంట్‌లో చేసిన వ్యాఖ్యలు నిలబడేవి కావన్నారు. సుఖేశ్ ఆరోపణలన్నీ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన అంశమని, ఇందులో లేవనెత్తిన అభియోగాలపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలే చూసుకుంటాయన్నారు. రానున్న వారం రోజుల్లో కవిత స్టేట్‌మెంట్‌కు కౌంటర్‌గా సుఖేశ్ నుంచి స్పందన వస్తుందని, మరిన్ని వివరాలు ఆయన వెల్లడించే అవకాశముందన్నారు. ఆయన తరఫున ఒక లాయర్‌గా తాను కొన్ని పరిమితుల్లో మాత్రమే వ్యాఖ్యానించగలనని, పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వడం సుఖేశ్‌కు సంబంధించిన వ్యవహారమన్నారు.