జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్

by GSrikanth |
జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి గురువారం మరో లేఖ విడుదల చేశారు. రెండు పేజీలతో కూడిన ఈ లేఖలో కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ నేతల పేర్లను ప్రస్తావించారు. గత వారం ఏపీకి 15 కోట్ల రూపాయలు ఇచ్చానని షార్ట్ నేమ్ పేర్కొన్న సుఖేశ్.. తాజాగా దానికి కొనసాగింపుగా ఇవాళ వివరాలను విఫులంగా వెల్లడించారు. ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని అతడికే తాను డబ్బులు ఇచ్చానని పేర్కొన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనలతోనే బీఆర్ఎస్ ఆఫీస్ లో పిళ్లైకి రూ.15 కోట్లు ఇచ్చానని స్పష్టం చేశారు.

బీఆర్ఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న 6060 బ్లాక్ కలర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కారులో ఈ డబ్బును ఇచ్చానని స్పష్టం చేశారు. తాను లేఖలో పేర్కొన్న అంశాలన్నింటికి ఆధారాలు ఉన్నాయని అవసరం అయితే నార్కో టెస్ట్ కు నేను సిద్ధమే అని పేర్కొన్నారు. ఈ తాజా లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు సౌత్ గ్రూప్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే విషయాన్ని బలపరుస్తోందనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story