Yadagirigutta : రాష్ట్ర శ్రేయస్సు కోసం రేపు యాదగిరిగుట్టలో సుదర్శన నారసింహ హోమం

by Y. Venkata Narasimha Reddy |
Yadagirigutta : రాష్ట్ర శ్రేయస్సు కోసం రేపు యాదగిరిగుట్టలో సుదర్శన నారసింహ హోమం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, లోక కల్యాణం, తెలంగాణ సుభిక్షాన్ని కాంక్షిస్తూ యాదగిరిగుట్ట(Yadagirigutta Temple) దేవస్ధానం నందు శ్రీ సుదర్శన నారసింహ హోమం(Sudarshana Narasimha Homam) నిర్వహిస్తున్నట్లుగా ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. హోమంలో భక్తుల, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి, శ్రీ లక్ష్మీనరసింహుల ఆశీర్వాదం పొందాలని కోరారు.

హోమంలో ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులు బీర్ల అయిలయ్య యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Next Story