Dedication Commission: ప్రభుత్వానికి అందిన డెడికేషన్ కమిషన్ రిపోర్టు

by Prasad Jukanti |
Dedication Commission:  ప్రభుత్వానికి అందిన డెడికేషన్ కమిషన్ రిపోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కులగణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ (Dedication Commission) తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సోమవారం కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు (Bhusani Venkateswara Rao) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shantikumari) ని సచివాలయంలో కలిసి నివేదిక అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ల కల్పన కోసం రాజకీయంగా వెనుకబడిన వర్గాల (బీసీ) జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం గతేడాది నవంబర్ లో మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఈ డెడికేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ డెడికేషన్ కమిషన్ పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేటర్లు సేకరించిన డేటాను ఆన్‌లైన్ చేయడం పూర్తి కాగానే ఆ రిపోర్టును ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు అందజేసింది. ఈ సమాచారానంతటిని క్రోడీకరించి ఫైనలైజ్ చేసిన డెడికేటెడ్ కమిషన్.. ఇవాళ నివేదికను ప్రభుత్వానికి సర్పించింది. ఈ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల (Reservation in Local Elections) అంశం ఓ కొలిక్కి వచ్చి ఎన్నికల దిశగా ప్రభుత్వం ముందడుగు వేసేందుకు కీలకం కాబోతున్నది.



Next Story

Most Viewed