- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎమ్మెల్సీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. కలెక్టర్లతో సీఈవో సుదర్శన్ రెడ్డి సమీక్ష

దిశ, వెబ్ డెస్క్: శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(Chief Election Officer) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ఆదేశించారు. శనివారం గ్రాడ్యుయేట్ (Graduates MLC), టీచర్స్ ఎమ్మెల్సీ(teacher MLC) స్థానాల ఎన్నికలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్(District Collectors) లతో వీడియో కాన్ఫరెన్స్(Video Conference) ద్వారా సమీక్ష(Review) జరిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్స్ శాసన మండలి సభ్యుల స్థానానికి, ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయుల స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు. షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు, 48 గంటలు, 72 గంటలలో తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ అందించాలని అన్నారు.
పార్టీల ప్రకటనలకు తొలగించండి..
అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పారు. అంతేగాక శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల చేయడం జరుగుతుందని , ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్క్రూటిని, ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని సీఈవో తెలిపారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారు చేయాలని, పెండింగ్ లో ఉన్న టీచర్స్, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 7 లోపు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఎంసీఎంసీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మీడియాలలో వచ్చే ప్రసారాలను పరిశీలించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం ఉండటానికి వీలు లేదని చెప్పారు.
పోలింగ్ అధికారులను గుర్తించండి..
పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడ అవసరమైన వసతులు కల్పించాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసే సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రచారానికి అవసరమైన అనుమతులను నిబంధనల ప్రకారం జారీ చేయాలని, ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని తెలిపారు. బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని, ఎన్ని జంబో బ్యాలెట్, నార్మల్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో సరి చూసుకోవాలని అన్నారు. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంకు ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులు ఉండే విధంగా సిబ్బందిని గుర్తించాలని, శాసన మండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేని మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించ వచ్చని వివరించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సర్టిఫికెట్లు జారీ, చేసి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు.
నామినేషన్ల స్వీకరణ అక్కడే..
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అకౌంటింగ్ బృందాలు, ఎంసీసీ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, వీఎస్‌టీ, వీవీటీ మొదలగు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని, పట్టభద్రులు, ఉపాధ్యాయులు కలిపి 1000 దాటని చోట కామన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని, ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు, టీచర్స్ స్థానాలకు సంబంధించిన నామినేషన్ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో, ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ టీచర్స్ స్థానానికి సంబంధించిన నామినేషన్ నల్గొండ కలెక్టరేట్‌లో స్వీకరించడం జరుగుతుందని, దీనికి అనుగుణంగా అక్కడ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.