- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యే పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ లో ధర్నా చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు, బీఆర్‌ఎస్ నేతలు భారీగా చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను బలవంతంగా కారులోకి నెట్టడంతో గాయమై, సృహ కోల్పోయారు. ఈ ఘటన పై తాజాగా కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు.
ఈ క్రమంలో అస్వస్థతకు గురైన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత బిడ్డల పై, ఎమ్మెల్యే పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5000 మంది అకౌంట్లో ఉన్న దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆయన మండిపడ్డారు.