- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నటుడు ప్రకాష్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రఘునందన్ రావు

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశం, దేశ ప్రధాని, సమాజంపై గౌరవం లేని ప్రకాష్ రాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై రఘునందన్ రావు ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ ప్రధాని గురించి జోకర్ అని అవహేళన గా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. 534 మంది పార్లమెంటు సభ్యులను "బంచ్ ఆఫ్ జోకర్లు" గా సంబోధించడం చాలా బాధాకరమని తెలిపారు. ఇంతకుముందు కూడా ఇలా చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంటనే ప్రకాష్ రాజ్ పై హోంశాఖ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తు ఎలక్షన్‌లో పోటీ చేయడానికి అనుమతిని నిరాకరించాలని డిమాండ్ చేశారు.
Next Story