- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలీస్ శాఖలో రాష్ట్ర స్థాయి పోటీలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పోలీస్ శాఖలో క్రీడల ఉల్లాసం వెల్లివిరుస్తుందని, ఏడు తర్వాత పోలీస్ శాఖ లో రాష్ట్రస్థాయి మూడవ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ను దాదాపు ఐదు రోజులు పాటు కరీంనగర్ లో నిర్వహించారని డీజీపీ డా జితేందర్ తెలిపారు. పోటీలలో ఎంపికైన వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి జాతీయస్థాయిలో అత్యధిక మెడల్స్ సాధించాలని యోచిస్తున్నమని తెలిపారు. రాష్ర్ట స్థాయి క్రీడా పోటీలు ముగిసిన సందర్భంగా ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచి, స్పెషల్ పోలీసు బెటాలియన్ లో డీఎస్పీలుగా ఉన్న క్రికెటర్ సిరాజ్, మహిళా బాక్సర్ నికత్ జరీన్ ల పర్యవేక్షణలో కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్న 20 జట్లలో 2380 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో 296 మంది మహిళలు, 12 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని తెలిపారు . 28 క్రీడ అంశాల్లో 236 బంగారు పతకాలు, 236 వెండి పథకాలు, 396 కాంస్య పథకాలు ప్రధానం చేసినట్లు తెలిపారు. ఓవరాల్ ఛాంపియన్ గా హైదరాబాద్ కమిషనరేట్ నిలిచిదన్నారు. రన్నర్ గా టీజీఎస్పీ రేంజ్ వన్ నిలిచిందని తెలిపారు. పోలీస్ శాఖలో రాష్ట్రస్థాయి పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహించేలా చర్యలు చెపడతామని తెలిపారు.