రాష్ట్ర పాలన గాంధీభవన్ ​నుంచి సాగుతోంది: బీజేపీ నేత సుభాష్​

by Ramesh Goud |
రాష్ట్ర పాలన గాంధీభవన్ ​నుంచి సాగుతోంది: బీజేపీ నేత సుభాష్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి సీఎంగా రేవంత్​రెడ్డి ఉన్నడా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని, ప్రభుత్వాన్ని గాంధీభవన్‌ నుండి నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్​ విమర్శించారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పాలనపై ఇప్పటివరకు రేవంత్​రెడ్డికి పట్టు రాలేదని, కాంగ్రెస్ పరిశీలకురాలే షాడో సీఎంగా వ్యవహరించడమంటే దేనికి సంకేతమని నిలదీశారు. మీనాక్షి నటరాజన్‌ ప్రభుత్వ హోదా లేని వ్యక్తిగా సచివాలయంలో మంత్రులు, అధికారులు పాల్గొన్న అధికారిక సమీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీభవన్‌కు పరిమితమై ఉండాల్సిన పార్టీ పరిశీలకురాలు, సచివాలయంలో షాడో సీఎంగా అధికార వ్యవస్థను ఒత్తిడికి గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. సన్నబియ్యంపై సమీక్షకు వెళ్లిన అధికారులు, లబ్ధిదారుల ఇళ్లలోకి వెళ్లి సన్నబియ్యం తినకుండా , రొట్టెలు తింటున్నారని, మంత్రులేమో సన్నబియ్యం బాగుందని చెబుతూ పార్టీ ఉనికి కోసం పాకులాడుతున్నారు. ఇది సన్నబియ్యం పథకం కాదని, బోగస్ నాటక ప్రదర్శన, పబ్లిసిటీకి ఫోజులుగా ఉన్నాయన్నారు. కంచగచ్చిబౌలిలో చెట్లు నరికి ప్రజలదే తప్పడం సరికాదని, పర్యావరణాన్ని హరించి తలకిందులుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు ప్రశ్నిస్తే ఫోటోలో ఏఐ ఉంది అంటూ తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించాల్సిన సమయాల్లో ప్రజలపైనే నేరాన్ని నెట్టడం బాధాకరమన్నారు.

రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిందంటూ ఇచ్చిన హామీలకు పంగనామం పెట్టడమేనా ఎన్నికలప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్రం గురించి తెలిసీ కూడా ఎడాపెడా ఉచిత హామీలు. అమలుకు నోచుకోని హామీలు గుప్పించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాసమస్యలపై అసలు ఎవరిని అడగాలో అర్థకావడం లేదని, ప్రజాపాలన ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం బ్యాచ్ హల్చల్ ఓవైపు, నల్లగొండ బ్యాచ్ మరోవైపు ఉండటంతో వారిని నియంత్రణకే సీఎంకు సమయం సరిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి మార్క్ పాలన కేవలం అబద్ధపు హామీలు, హంగు ఆర్భాటాలకే పరిమితమైందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి సాగిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన సమయంలో పబ్లిసిటీ డ్రామాలతో ప్రజల్ని మాయ చేసేందుకు కుట్రలు నడుస్తున్నాయని మండిపడ్డారు.



Next Story

Most Viewed