- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నీ పాపం పండుద్ది! నెటిజన్ కామెంట్‌కు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసుల మాస్ వార్నింగ్

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా కొంత మంది వాహనదారులు నిర్లక్ష్యం వీడడం లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించని సంఘటనలో నిత్యం రోడ్ల మీద జరుగుతున్నా యధేచ్చగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అయితే తమను ఎవరూ గమనించరని వాహనదారులు చేస్తున్న నిర్లక్ష్యంపై తాజాగా (SR Nagar Traffic Police) ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా చేసిన ఓ ట్వీట్ కు నెటిజన్ రియాక్ట్ అయ్యారు. సదరు నెటిజన్ చేసిన కామెంట్ కు పోలీసులు అంతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వాహనాల నంబర్ ప్లేట్ లను కవర్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేశామని ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ లు తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 'తాత్కాలిక ఆనందానికి అలవాటు పడితే కటకటాలు తప్పవు. తప్పించుకొని తిరగాలని చూస్తే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు మిమ్మల్ని వదలదు. తరచూ తనిఖీలు చేస్తూ ఇలాంటి ఉల్లంఘనదారులను గుర్తించి వారి వాహనాలను జప్తు చేస్తారు.
నంబర్ ప్లేట్ వయలెన్స్ ను అవాయిడ్ చేయాలి' అని వాహనదారులకు సూచిస్తూ ఓ పోస్టు చేశారు. అయితే ఈ పోస్టుకు 'మిడ్ వికెట్' అనే ఓ నెటిజన్ స్పందిస్తూ 'నేను నా బైక్ కు నెంబర్ లేకుండా గత 10 నెలల నుంచి అమీర్ పేట్ లో తిరుగుతున్నాను. ఇంతవరకు జప్తు చేయలేదు' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు రిప్లయ్ ఇచ్చిన ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు 'డియర్ మిడ్ వికెట్.. నీ పాపం కూడా ఏదో ఒక సమయంలో పండుతుంది' అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరో నెటిజన్ స్పందిస్తూ తమను ఎవరూ పట్టుకోలేరని ధైర్యంతో కొంత మంది ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ దాచిపెడుతున్నారని అలాంటి వారిపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశాలను పరిశీలించాలని కోరారు.