- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంతకు విచారణలో కవితను CBI ఏం ప్రశ్నించనున్నది?
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కూతురు కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన ఒక సాక్షిగా ఆమెను విచారించనున్నది. అయితే అధికారులు ఏయే వివరాలు రాబడతారనేది ఆసక్తికరంగా మారింది. ఎంతసేపు ప్రశ్నిస్తారు? ఎంతమంది అధికారులు వస్తారు? ఏ స్థాయి ఆఫీసర్లు విచారిస్తారు? ఎమ్మెల్సీ ఏం సమాధానం చెప్తారు? అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా వెల్లడించిన విషయాలేంటి? స్కామ్ తో కవితకు లింకులున్నట్లు వివరాలు వెల్లడయ్యాయా? ఇవి ఇప్పుడు పార్టీ శ్రేణులు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
లింకులు తేలడంతోనే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కానీ ఈ స్కామ్‌లో పలువురిని అరెస్టు చేసి ప్రశ్నించిన తర్వాత ఆమె ప్రమేయంపై పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తున్నది. వాటిని నివృత్తి చేసుకునేందుకు సీబీఐ ఆమెను ప్రశ్నించాలని భావించి నోటీసులు జారీ చేసింది. అప్రూవర్ గా మారిన దినేశ్ అరోరా వెల్లడించిన అంశాలతోపాటు, అరెస్టయిన పలువురి నుంచి రాబట్టిన వివరాలపై కవితను విచారించనున్నట్లు సమాచారం.
వివరాల సేకరణ.. విశ్లేషణ
మనీష్ సిసోడియా, విజయ్ నాయర్, అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో ఉన్న సంబంధాలేంటి?
అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డితో వ్యాపార సంబంధాలేమైనా ఉన్నాయా?
ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో ఎలాంటి ప్రమేయం ఉన్నది?
ప్రమేయం లేనప్పుడు నిందితులతోపాటు పలువురిని ప్రశ్నించినప్పుడు మీ పేరు ఎందుకు వెలుగులోకి వచ్చింది?
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో ఈ అంశానికి సంబంధించి భేటీ అయ్యారా?
అమిత్ అరోరాతో పరిచయం ఉన్నదా? ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో 'సౌత్ గ్రూపు' ప్రస్తావన తెచ్చి అందులో మీ పేరును ఎందుకు పేర్కొనాల్సి వచ్చింది?
ఈడీ పేర్కొన్నట్లుగా మొబైల్ ఫోన్లను మార్చడం, ధ్వంసం చేయడం నిజమేనా? ఆ అవసరం ఎందుకు ఏర్పడింది?
ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలో స్పెషల్ ఫ్లైట్‌లలో ఢిల్లీకి వచ్చింది నిజమేనా? ప్రైవేటు హోటల్‌లో లిక్కర్ ట్రేడర్లను, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కలిసింది నిజమేనా?
ఇలా పలు విషయాలపై కవితను విచారించే అవకాశమున్నది. అంతేకాకుండా దినేశ్ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోపాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా గతంలో విచారణ సందర్భంగా వెల్లడించిన అంశాలనుకూడా కవిత ఇచ్చే వివరణతో సీబీఐ విశ్లేషించనున్నది. అయితే తొలిసారి సీబీఐ విచారణకు హాజరవుతున్న కవిత ఏ విషయాలు వెల్లడిస్తారు, గతంలో ఆమెకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు ఇప్పటికే వెల్లడించిన అంశాలతో ఎక్కడైనా పొసగని లేక విరుద్ధమైన అంశాలు ఉంటాయా? వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ తరహాలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారా.. ఇలాంటివన్నీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Also Read....
నేడు పాలమూరులో ముఖ్యమంత్రి స్పీచ్‌పై అంతా ఉత్కంఠ!