- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రాలో చస్తానన్న వ్యక్తి... క్షణాల్లో కాపాడిన నల్లగొండ పోలీసులు(వీడియో)
దిశ, నల్లగొండ: అది ఎవరు ఉహించలేని ఘటన ప్రజలకు ఎల్లపుడు అన్ని విధాలుగా పోలీసులు రక్షణగా ఉంటామని తెలిపే సంఘటన క్షణాల్లో చనిపోబోయే వ్యక్తిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి తనకు రావాల్సిన భూమిని సోదరీమణుల పేరునా రాశాడు అని, నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని బ్రహణ వెల్లంల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సోమనబోయిన శ్రీనివాస్ యాదవ్(40)కు ఇద్దరు పిల్లలు. తన తండ్రి సోమన బోయిన ఆడిమయ్య, తన సోదరి కడారి మాధవి, బొడ్డు జానకి, కంగన బోయిన యమునా.. వీరు అందరూ తన చావుకు కారకులు అని తెలుసుపుతున్నా అని సోమనబోయిన శ్రీనివాస్ ఒక వీడియోలో ఆంధ్రలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర తాను చనిపోతున్నట్లు, తన ప్రియమైన గ్రామ ప్రజలకు తెలుపుతున్నా అంటూ తన చివరి చూపు ఇదే తన సాక్ష్యం అని, తాను ఇక్కడ దగ్గర్లో లేను గ్రామ సర్పంచ్ అశోకరెడ్డి మాధవి రెడ్డికి, మాజీ ఎంపీపీ పబ్బతి రెడ్డి వెంకట్ రెడ్డికి, ఎంపీటీసీ సభ్యులు యాదయ్య, మాజీ సర్పంచ్ నర్సయ్యకి తనకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దు అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆ వీడియో గ్రామ వాట్సాప్ గ్రూపులో సెండ్ చేశాడు. దీంతో ఆ విషయం గ్రామ యువకులు మరియు బంధువులు నార్కట్ పల్లి సీఐ శివరాంరెడ్డికి తెలిసింది. అతడిని వెంటనే రక్షించాలి అంటూ నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డికి చెప్పగా తన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని క్షణాల్లో అదుపులోకి తీసుకున్నారు. అతడికి, తన బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాను అని ఎస్ఐ తెలిపారు. ఈ విషయం వైరల్ కావడంతో క్షణాల్లో అతడిని కాపాడిన ఎస్ఐని పలువురు నెటిజన్లు మరియు ప్రజలు అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్ నల్గొండ.. పోలీస్... అంటున్నారు.