ట్రాఫిక్ నియమాలను బ్రేక్ చేసిన వారిపై స్పెషల్ ఫోకస్.. హైదరా‌బాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి

by Shiva |
ట్రాఫిక్ నియమాలను బ్రేక్ చేసిన వారిపై స్పెషల్ ఫోకస్.. హైదరా‌బాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : సిటీ శివారు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నగరంలో రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుం హైదరాబాద్ పట్టణంలో సెక్యూరిటీ వీక్ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను బ్రేక్ చేస్తే.. వారిపై స్పెషల్ ఫోకస్ పెడతామని వార్నింగ ఇచ్చారు. నగరంలో పోలీసు సిబ్బంది నిరంతరం ట్రాఫిక్‌‌ను మానిటర్ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాఠశాలల వద్ద హెచ్సీఎస్‌సీ ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కేవలం ఒక్క హైదరాబాద్ నగర పరిధిలో 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed