- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సోనియా గాంధీ వ్యాఖ్యలను వక్రీకరించారు: మంత్రి సీతక్క

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని, అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా లేనిపోని వివాదాలు సృష్టిండం బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్య అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగంలో అన్ని అవాస్తవాలనే కేంద్ర ప్రభుత్వం చేర్చిందని శుక్రవారం ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సామాన్యులను పూర్తిగా రాష్ట్రపతి ప్రసంగం విస్మరించిందని.. నిరుద్యోగ సమస్య, ఆర్దిక రంగ ఒడిదుడుకులను రాష్ట్రపతి ప్రసంగంలో కనిపించలేదన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకే సోనియా గాంధి వ్యాఖ్యలపై వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ రాష్ట్రపతిని అవమానలపాలు చేసేలా నరేంద్రమోడి నేతృత్వంలోని బీజేపీ వ్యవహరించిందని గుర్తు చేసారు.
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వనించకుండా బీజేపీ తన కురుచ బుద్దిని ప్రదర్శించిందని ఫైర్ అయ్యారు. ఆయోద్య రామమందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వనించలేదని ప్రశ్నించారు. ఆదివాసీలకు అడుగడునా అన్యాయం చేసి...ఇప్పుడు రాష్ట్రపతి అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. అటవీ హక్కు చట్టాన్ని నీరుగార్చి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇష్టారీతిన మైనింగ్ కు అనుమతులిస్తూ, పెసా చట్టాన్ని తుంగలో తొక్కిన బీజేపీ..ఆదివాసీల గౌరవం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ఆదివాసీల ప్రయోజనాలు కాదని..ఆదానీకి వంత పాడే బీజేపీ..రాష్ట్రపతి పదవిని అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు.